Jul 31,2023 22:25

 ప్రేమను చాటుకున్న కుమారుడు
ప్రజాశక్తి-హనుమాన్‌ జంక్షన్‌ (గన్నవరం) :
తల్లిదండ్రులను పట్టిం చుకోని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కన్న తండ్రి మీద ప్రేమను మర్చిపో కూడదని కాంస్య విగ్రహం ఏర్పాటు చేశాడు ఓ కొడుకు. తన సొంత పొలంలో విగ్రహం పెట్టి తన ప్రేమను చాటు కున్నాడు. ఈ వైనం బాపులపాడు మండలం కొత్త రెమల్లిలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన దొండపాటి సుబ్బారావు గత సంవత్సరం క్రితం కాలం చేసాడు. సుబ్బారావు కుమారుడు దొంద పాటి శ్రీ రంగ శ్రీనివాసరావు(శ్రీశ్రీ) తన తండ్రి జ్ఞాపకం రేమల్లి గ్రామంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసరావునీ చూసిన గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో కూడా ఇలా చేసే కొడుకులు ఉన్నారా అని ఆశ్చర్యానికి లోనయ్యారు. తండ్రి అస్తి ఎంత ఇచ్చారా అని ఆలో చించే కొడుకులు ఉన్నారు కానీ తండ్రి పై ఉన్న ప్రేమ నిరూ పించిన శ్రీనివాసరావు పలువురికి ఆదర్శమని గ్రామస్తులు పేర్కొన్నారు.