తిరుపతిలో చిల్లీస్ 3వ బ్రాంచ్ ప్రారంభం
ప్రజాశక్తి -తిరుపతి సిటి
తిరుమల బైపాస్ రోడ్‌లో తిరుమల మ్యూజిక్ సెంటర్ పక్కన చిల్లీస్ రెస్టారెంట్ మూడవ బ్రాంచి ప్రారంభించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిల్లీస్ ఫౌండర్ మధు మోహన్ రావు దంపతులు, సింధూరి పార్క్ అధినేత వెంకయ్య , బ్లీస్ హౌటల్ అధినేత బాలకష్ణ రెడ్డి , తిరుపతి ఈస్ట్ డిఎస్పి సురేంద్ర రెడ్డి చేతులు మీదుగా చిల్లీస్ రెస్టారెంట్ హౌటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిన్న వయసులో చిల్లీస్ రెస్టారెంట్ అండ్ హౌటల్స్ అధినేత వీరాంజనేయులు (చిల్లీస్ అంజి) ని తిరుపతి జిల్లా హౌటల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా చిల్లీస్ అంజిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న నెల వ్యవధిలోని అంజి మంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు హౌటల్స్ అండ్ రెస్టారెంట్స్ యజమానులకు ప్రతినిధుల బందానికి సిబ్బందికి అనేక సహాయ సహకారాలు ప్రోత్సాహం అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కొర్లగుంటలో మూడో బ్రాంచ్ చిల్లీస్ రెస్టారెంట్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే తిరుపతిలో మూడు బ్రాంచ్లు కడపలో ఒక బ్రాంచ్ని ప్రారంభించడం జరిగిందని, త్వరలో మరో బ్రాంచ్ ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతరం చిల్లీస్ అంజి మాట్లాడుతూ నగర ప్రజల కోరిక మేరకు కొర్లగుంటలో రెస్టారెంట్ మూడో బ్రాంచ్ ను ప్రారంభించామని చెప్పారు. గత 14 సంవత్సరాల నుంచి కస్టమర్లు చిల్లీస్ రెస్టారెంట్ అండ్ హౌటల్స్ ను ఎంతో ఆదరించి అభిమానిస్తున్నారని తెలియజేశారు. తాను సేవ్ వాటర్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగిందని ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించడం వలన ఎంతో పేరు ప్రఖ్యాతులు తనకు తన బందానికి రావడం కస్టమర్ల సేవే అని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి జిల్లా హౌటల్ రెస్టారెంట్స్ సెక్రటరీ నితిన్ చక్రవర్తి, ట్రెజరర్ శ్రీహరి, అసోసియేషన్ నేతలు సభ్యులు పాల్గొన్నారు..
తిరుమల బైపాస్‌రోడ్డులో బ్రాంచిని ప్రారంభిస్తూ...










