కనక నరసారెడ్డి బదిలీ
తిరుపతి ఆర్‌డిఓగా నిశాంత్ రెడ్డి
శ్రీకాళహస్తిఆర్డీవోగా ఎన్ రవిశంకర్ రెడ్డి
ప్రజాశక్తి -తిరుపతి టౌన్
రాష్ట్రంలో ఐదు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆర్డీవోలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జోహార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఆర్ డి ఓ గా ఉన్న కనక నర్సారెడ్డి బదిలీ అయ్యారు. నూతన ఆర్డీవోగా నిశాంత్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాళహస్తి ఆర్‌డిఒగా ఎన్ రవిశంకర్ రెడ్డి నియమించారు. ఇక్కడ ఆర్డీవోను దుర్గ గుడి ఈవోగా నియమించిన విషయం తెలిసిందే. అలాగే పలమనేరు ఆర్డీవోగా నిమ్మనపల్లి మనోజ్ రెడ్డిని నియమించారు.
కనక నరసారెడ్డి బదిలీ










