Oct 24,2023 22:40

తిరుమలలో వేడుకగా పార్వేటి ఉత్సవం

తిరుమలలో వేడుకగా పార్వేటి ఉత్సవం
తిరుమల : తిరుమలలో పార్వేటి ఉత్సవం నూతన మండపంలో వేడుకగా జరిగింది. టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. టిటిడిలో పనిచేస్తున్న అర్చకులు కావచ్చు, ఆగమ పండిగులు కావచ్చు, అత్యున్నత అధికారులంతా జ్ఞానం లేకుండా పనిచేస్తారని, మనమొక్కరమే చాలా గొప్పగా ఆలోచిస్తామని అనుకోవడం బాధాకరమన్నారు. పార్వేటి మండపం చాలా శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉండేదని, దాన్ని ఆధునీకరించామన్నారు. ప్రతి భక్తుడూ ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారన్నారు.