టి.నరసాపురం : టి.నరసాపురం ఎస్‌ఐలగా బి.సురేంద్ర కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. పెనుమంట్ర మండలంలో పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకూ పనిచేసిన ఎస్‌ఐ కె.సతీష్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.










