Sep 23,2023 20:48

మంత్రాలయంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినా, సరైన సాక్ష్యాధారాలు లేనందున జడ్జీలు తీర్పును రిజర్వ్‌లో ఉంచడం కాలయాపన చేయడమేనని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి, నాయకులు అశోక్‌ రెడ్డి తెలిపారు. శనివారం రాఘవేంద్ర సర్కిల్‌లో తిక్కారెడ్డి ఆధ్వర్యంలో 12వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కౌతాళం మండలం క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జీలు కుర్చున్నారు. మందుగా మహాత్మగాందీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, టిడిపి నాయకులు, కార్యకర్తలు బయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా బయటికొస్తారని తెలిపారు. రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన అమరావతి ప్రాంత తుళ్లూరుకు చెందిన రైతులు మద్దతు తెలిపారు. క్లస్టర్‌ ఇన్‌ఛార్జీలు అడివప్ప గౌడ్‌, వెంకటపతి రాజు, కోట్రేష్‌ గౌడ్‌, వెంకటరెడ్డి, రమేష్‌ గౌడ్‌, కురుగోడు, టిప్పు సుల్తాన్‌, కాత్రికి చంద్ర, సిద్ధు, గోపాల్‌ నాయక్‌, ఉమేష్‌, మంజునాథ్‌ ధని, గొట్టయ్య, కావలి ఈరప్ప, దుద్ది ఉసేని, హాల్వి ఉసేని, మల్లప్పగౌడు, ముసన్న గౌడ్‌, దేవన్న గౌడ్‌, రంగస్వామి, రహ్మాన్‌, తిరుమల రెడ్డి, గురుస్వామి, ఆదెప్ప, సోము, రమేష్‌, డేవిడ్‌ దీక్షల్లో కూర్చున్నారు. తిక్కారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పన్నగ నాగశయన స్వామి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. సంఘీభావంగా దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు సాయిబాబా, మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్‌ సాబ్‌, బీసీ సీనియర్‌ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, బీసీ సెల్‌ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్‌ రెడ్డి, తెలుగు యువత కోసిగి మండల అధ్యక్షులు నాడిగేని మహదేవ్‌, చిన్నభూంపల్లి మాజీ సర్పంచి నరసింహులు, చిలకలడోణ హనుమంతు, అశోక రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్‌ విజయ రామిరెడ్డి, పవన్‌ కుమార్‌, సూగూరు భాస్కర్‌ రెడ్డి, బెళగల్‌ గుండేష్‌, ఉసేని, ఎస్సీ సెల్‌ నాయకులు మారెప్ప, ఏబు, జోజి, ఐ టిడిపి సల్మాన్‌ రాజు, నీలకంఠ, చిదానంద, వీరేష్‌ పాల్గొన్నారు. అంతకుముందు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు వెంకటపతి రాజు, అడివప్పగౌడ్‌ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తామని, తిక్కారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి, పార్టీ పరిశీలకులు శివబాల పాల్గొన్నారు. ఆలూరులో మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో 13వ రోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. టిడిపి మండల కన్వీనర్‌ అశోక్‌ యాదవ్‌ అధ్యక్షత వహించారు. టిడిపి యాదవ సంఘం నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నిలబడి అర్ధనగంగా నిరసన తెలిపారు. టిడిపి రాష్ట్ర నాయకులు నారాయణ రెడ్డి, నారాయణ, రామనాథ్‌ యాదవ్‌, మాజీ ఎంపిపిలు సన్నప్ప, కృష్ణ యాదవ్‌, జిల్లా నాయకులు భాస్కర్‌, నాగరాజు, కొమ్ము రామాంజి, తిమ్మారెడ్డి యాదవ్‌, ఆంజనేయ్య, ఈరప్ప, రాము యాదవ్‌, సోమన్న, జలంధర్‌, ఐకాంత్‌, మాజీ సర్పంచి రంగస్వామి, గూళ్యం రామాంజినేయులు, దేవేంద్రప్ప, కుపేంద్ర, అరికేర ఆంజనేయులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్‌లో నిరాహార దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయ నాగేశ్వర్‌ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాములు మాట్లాడారు. టిడిపి నాయకులు సుందర్‌ రాజు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్‌, దయాసాగర్‌, రామకృష్ణ నాయుడు, మల్లికార్జున, మిఠాయి నరసింహులు, దేవిబెట్ట సోమేష్‌ రెడ్డి, రంగస్వామి గౌడ్‌, మధుబాబు, తురేగల్‌ నజీర్‌ అహ్మద్‌, హుసేన్‌ పీర, మునీర్‌ కాసీమ్‌ వలీ, డీలర్‌ ఈరన్న, దాదా వలీ, దేవేంద్ర, శ్రీకాంత్‌, బోయ రంగన్న, దామా నరసింహులు, మాబు, టీ స్టాల్‌ చంద్రన్న, కొండన్న గౌడ్‌, అంజి, శంకర్‌ గౌడ్‌, కటారి రాజేంద్ర, ఈశ్వర్‌, వడ్డే కృష్ణ, జయన్న, నాగేష్‌ ఆచారి, శిల్పి భాస్కర్‌, బనవాసి నరసింహులు, డ్రైవర్‌ ఈరన్న పాల్గొన్నారు.

ఆలూరులో మాట్లాడుతున్న కోట్ల సుజాతమ్మ
ఆలూరులో మాట్లాడుతున్న కోట్ల సుజాతమ్మ