Jul 19,2023 20:34

మిషన్‌ రాయలసీమ గోడపత్రికను విడుదల చేస్తున్న రాజాసాహెబ్‌

ప్రజాశక్తి - దేవనకొండ
రాయలసీమ అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని తెలుగు యువత నియోజకవర్గ నాయకులు పి.రాజా సాహెబ్‌, టిడిపి మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం ఆలూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు రామన్న, చిన్న బాబు ఆదేశాల మేరకు మిషన్‌ రాయలసీమ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టిడిపి అధికారంలోకి వస్తే నారా లోకేష్‌ చెప్పిన విధంగా రాయలసీమను ఏవిధంగా అభివృద్ధి చేయాలో, ఎలా చేస్తారో వివరించారు. తెలుగు యువత మండల అధ్యక్షులు పి.ఖాసీం, మాజీ ఎంపిటిసి ఆకుల వీరేష్‌, తలమరి సర్పంచి రాజు, సీనియర్‌ నాయకులు పి.మలకన్న, డీలర్‌ బండ్లయ్య, రాజగోపాల్‌ గౌడ్‌, నాగేశ్వరరావు, బేల్దారు సుభాన్‌, కుంకునూరు రామాంజనేయులు, ఐటిడిపి రామాంజనేయులు, టైలర్‌ సలాం పాల్గొన్నారు.