ప్రజాశక్తి - ఆదోని రూరల్
టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని గణేకల్ గ్రామంలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ'లో భాగంగా మీనాక్షి నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ చిహ్నం సైకిల్ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమం, మరొకటి అభివృద్ధి అని తెలిపారు. 'ఒక్కఛాన్స్' పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పారు. జగన్ చేతగానితనం వల్ల రాష్ట్రం నేడు అధోపాతాళానికి పడిపోయిందన్నారు. భస్మాసుర పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక, మహిళా సాధికారత, భద్రత అటకెక్కిందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, వ్యాపార రంగంలో పెట్టుబడుల ఊసే లేదని తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగం లేకపోవడంతో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని చెప్పారు. బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. 45 రోజులపాటు జరిగే 'భవిష్యత్తు గ్యారెంటీ'ని కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి టిడిపి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తారన్నారు. నాయకులు రంగస్వామి నాయుడు, బుద్ధారెడ్డి, ఆరేకల్లు రామకృష్ణ, అయ్యన్న, మాబాష, బాబు నాయుడు, అశ్వర్థ్ రెడ్డి, గణేకల్లు గ్రామ నాయకులు విరుపాక్షి, బంగారయ్య, అయ్యన్న పాల్గొన్నారు. అలాగే మండలంలోని మండగిరి పంచాయతీలో టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె కృష్ణమ్మ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, వడ్డెమాన్ గోపాల్, మాజీ ఎంపిపి మురళీ, వెంకట్రామన్ గౌడ్, సాధిక్ వలీ, టిడిపి జిల్లా తెలుగు యువత నాయకులు గుడిసె రామకృష్ణ, ఢణాపురం నాగిరెడ్డి, గిరిధర్, బాబురావు, రాఘవ, జమ్మన, నాగేంద్ర, భరత్, వీరేష్ పాల్గొన్నారు. నందవరం టిడిపి కార్యాలయంలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ'పై సమావేశం నిర్వహించారు. టిడిపి మండల సీనియర్ నాయకులు ఈరన్న గౌడ్, ఖాసీం వలీ, చిన్న రాముడు, రైస్ మిల్ నారాయణ రెడ్డి, గోపాల్ మాట్లాడారు. టిడిపి మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. టిడిపి నాయకులు వీరేష్, దావీద్, రామన్న గౌడ్, రాఘవరెడ్డి, కొండయ్య, సాధిక్, పాల్గొన్నారు.










