Jun 12,2023 22:18

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

ప్రజాశక్తి - ఓబుల దేవర చెరువు : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐటిఐలో సోమవారం టిడిపి బూత్‌ ఇన్‌ఛార్జులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, మండల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డితో పాటు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు బచ్చల ఫుల్లయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా పల్లె మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు టిడిపికి ఎంతో కీలకమన్నారు. రాష్ట్రంలో సైకో పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టిడిపికి పూర్వవైభవం తీసుకురావటానికి ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజలే జగన్‌ ప్రభుత్వానికి సమాధి కడతారని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్‌ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్‌, బోయపల్లి శివారెడ్డి, నిజాం, మండోజి ఆరిఫ్‌ ఖాన్‌, షబ్బీర్‌బాషా, ఓబుల్‌ రెడ్డి, కంచి సురేష్‌, అంజినప్ప, పీట్ల సుధాకర్‌, సౌదీ నాగరాజు, అబ్బులు హుస్సేన్‌, వెంకటేష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.