Oct 21,2023 20:02

కోసిగిలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌ రెడ్డి

ప్రజాశక్తి - కోసిగి
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే టిడిపితోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. శనివారం కోసిగిలోని 9వ వార్డులో 'బాబుతో నేను' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న మోసాల గురించి ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో టిడిపిని ఆదరించాలని, మంత్రాలయం నియోజకవర్గంలో పాలకుర్తి తిక్కారెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే తిక్కారెడ్డితోనే సాధ్యమన్నారు. టిడిపి మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జీ భరద్వాజ్‌ శెట్టి, వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, పంపాపతి, కొండగేని వీరారెడ్డి, రవితేజ శెట్టి, గవిగట్టు ఈరయ్య, గుండాల ఈరయ్య, నాడిగేని వీరారెడ్డి, చిన్నభూంపల్లి మాజీ సర్పంచి నరసింహులు, జనార్ధన్‌, ప్రభాకర్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ సీనియర్‌ నాయకులు మారెప్ప, ఎంపిటిసి రాజు, మారేష్‌, నర్సారెడ్డి, లక్ష్మి కాంత్‌, గోపాల్‌, డీలర్‌ నరసన్న, వడ్డే రామయ్య, ఖలందర్‌, దాదా ఉసేని, కప్పయ్య, లసుమయ్య, శ్రీనివాసులు, శ్యాంసుందర్‌, నీలకంఠ, దుద్ది నాగేష్‌, హనుమంతు, దొడ్డయ్య, నారా లోకేష్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు. పెద్దకడబూరులో 'బాబుతో నేను' నిర్వహించారు. తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు. టిడిపి నాయకులు మల్లికార్జున, వీరేష్‌ గౌడ్‌, నరసన్న, మహాదేవ, బొగ్గుల నరసన్న పాల్గొన్నారు.

పెద్దకడబూరులో మాట్లాడుతున్న రమాకాంత్‌ రెడ్డి
పెద్దకడబూరులో మాట్లాడుతున్న రమాకాంత్‌ రెడ్డి