ప్రజాశక్తి - హాలహర్వి
రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి టిడిపితోనే సాధ్యమని టిడిపి ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ తెలిపారు. మంగళవారం హాలహర్విలో సుజాతమ్మ ఆధ్వర్యంలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ', మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి టిడిపి విధానాలను తెలిపే కరపత్రాలను పంచి పెట్టారు. ఈ సందర్భంగా సుజాతమ్మ మాట్లాడారు. ప్రతి మహిళకూ ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ సంవత్సరానికి రూ.15000 చొప్పున అందజేస్తామని తెలిపారు. నాయకులు కృష్ణమ నాయుడు మాట్లాడుతూ... ప్రతి కుటుంబానికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద రూ.3 వేలు ఇస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. సర్పంచి మల్లికార్జున, వెంకటేశ్వర రెడ్డి, పాల్ రెడ్డి, హరి రెడ్డి, శ్రీధర్, ఎల్లప్ప పాల్గొన్నారు.
సుజాతమ్మను సన్మానిస్తున్న సర్పంచి మల్లికార్జున










