Aug 07,2023 20:18

మహాశక్తి కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి మహిళ నాయకులు

ప్రజాశక్తి- కోసిగి
రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలని తెలుగు మహిళ జిల్లా కార్యదర్శి నాడిగేని నరసమ్మ, శంకుతలమ్మ, సరోజమ్మ, రూతమ్మ తెలిపారు. టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు 'మహాశక్తి' కార్యక్రమంలో భాగంగా కోసిగి శ్రీఎల్లమ్మ అవ్వ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోసిగి మండలం కోల్మన్‌ పేట గ్రామంలో గుడిసె మంగమ్మ, తిప్పలదొడ్డి ఎల్లమ్మ అధ్యక్షతన ఇంటింటికీ తిరుగుతూ మహిళలు కోసం చంద్రబాబు ప్రకటించిన పథకాలను వివరించారు. నియోజకవర్గంలో పాలకుర్తి తిక్కారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాడిగేని లక్ష్మి, దుద్ది సర్పంచి వరలక్ష్మి పాల్గొన్నారు.