Oct 18,2023 20:09

సమావేశంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

ప్రజాశక్తి - కోసిగి
టిడిపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని టిడిపి మంత్రాలయం ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక 8వ వార్డులోని సిద్ధప్పపాలెంలో టిడిపి మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌ అధ్యక్షతన 'బాబుతో నేను' నిర్వహించారు. హొమూగలదొడ్డి గ్రామంలో అనారోగ్యంతో ఉన్న టిడిపి కార్యకర్త చంద్రన్నను పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయించారని వైసిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలో, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలంటే టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, రంగడు, భరద్వాజ్‌ శెట్టి, మహాదేవ, కొండగేని వీరారెడ్డి, మారెప్ప, వడ్డే రామయ్య, ఉమర్‌ పాల్గొన్నారు.