ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : బి సి వర్గాలకు మొదటినుంచి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనే అని మాజీ మంత్రి, నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో బీసీ నాయకులు ఆధ్వర్యంలో బీసీల భరోసా బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పల్లె మాట్లాడుతూ, బీసీల సంక్షేమానికి, వారి అభివృద్ధికి టిడిపి ఎప్పుడు ముందుంటుందన్నారు. వైసిపి బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్ల లో కోత విధించిందని రాజకీయంగా కూడా బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. 2024లో టిడిపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు మునుపు జిల్లా రాష్ట్ర బీసీ నాయకులు మాట్లాడుతూ మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో లోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ నాలుగేళ్లలో నిత్యవసర వస్తువులు, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిన అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కురుబ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ గంగుల కుంట రమణ, గాండ్ల సాధికారిక సమితి కన్వీనర్ విశాలాక్షి, వడ్డెర సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, జిల్లా కన్వీనర్ పుల్లపు రవీంద్ర, బోయ సాధికారిక జిల్లా కన్వీనర్ బోయ రామాంజనేయులు, వడ్డెర్ల రాయలసీమ కోఆర్డినేటర్ ఎల్‌ఐసి నరసింహులు, గౌడ సాధికారిక జిల్లా కన్వీనర్ నీళ్ల రమణ గౌడు, బెస్త చలపతి, సామకోటి ఆదినారాయణ, వలిపి శ్రీనివాసులు, పీట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.










