ప్రజాశక్తి - కౌతాళం
మండలంలోని బదినేహాల్ గ్రామాభివృద్ధి టిడిపితోనే సాధ్యమని టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి.నాయుడు, టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో టిడిపి బలపరచిన సర్పంచి అభ్యర్థి హరిజన వీరేష్ (కత్తెర గుర్తు)కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. బుధవారం గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బదినేహాల్ గ్రామంలో మార్పు మొదలైందని, కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసుగు చెందారని తెలిపారు. వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో వెనకబడిందన్నారు. నిధుల్లేక పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. గ్రామంలో పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కోట్రేష్ గౌడ్, వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులు టిప్పు సుల్తాన్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివమూర్తి, ఆర్‌టిఎస్ ప్రోగ్రామ్ నియోజకవర్గ కోఆర్డినేటర్ దశరథ రాముడు, మైనారిటీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజానంద్, దొడ్డన్న గౌడ్, కాత్రికి మాజీ సర్పంచి చంద్ర, కావలి ఈరప్ప, శివప్పగౌడ్, సూగూరు నాగేష్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు, సురేంద్ర, డేవిడ్, బదినేహాల్ నాయకులు బోయ వీరేష్, నరసింహులు, ఈరన్న, ఉమేష్ గౌడ్, రంగస్వామి, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, మంజునాథ్ పాల్గొన్నారు.
బదినేహాల్‌లో ప్రచారం చేస్తున్న బిటి, తిక్కారెడ్డి










