ప్రజాశక్తి - కురుపాం : చంద్రబాబుతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. మండలంలోని మరిపల్లిలో ఆదివారం బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబునాయుడుకు అక్రమంగా, కక్షపూరితంగా వైసిపి ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఆయనకు అండగా మనమంతా ఉండి రానున్న ఎన్నికల్లో చంద్రబాబునే గెలిపించుకోవాలని, అప్పుడే మన గిరిజనులు అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కెవి కొండయ్య, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్, జిల్లా కో ఆప్షన్ మాజీ సభ్యులు రంజిత్ కుమార్, నాయకులు వెంపటాపు భారతి, గవరయ్య, గౌరి, బి.యువరాజు, వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచులు సుక్కు, హెచ్.సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.
సాలూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వైసిపి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని నియోజకవర్గ ఇన్చార్జి జి.సంధ్యారాణి అన్నారు. పట్టణంలో చినహరిజనపేటలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఆమె ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపికి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న తీరు చూసి వైసిపి ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబునాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించిందని చెప్పారు. సిఎం జగన్ అరాచక పాలన గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, ఎఎంసి మాజీ చైర్మన్ కేతిరెడ్డి చంద్రశేఖర్, పట్టణ నాయకులు నల్ల అర్జున్ రావు పాల్గొన్నారు.










