ప్రజాశక్తి - చిప్పగిరి
రాష్ట్రంలో త్వరలోనే టిడిపికి పూర్వ వైభవం వస్తుందని, ప్రజలంతా ఎదురుచూస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఆలూరు మాజీ ఇన్‌ఛార్జీ వైకుంఠం మల్లికార్జున చౌదరి, మాజీ ఇన్‌ఛార్జీ వీరభద్ర గౌడ్ తెలిపారు. శనివారం చిప్పగిరిలో టిడిపి సీనియర్ నాయకులు, కీర్తిశేషులు మాల ఆంజనేయ చిన్న కుమారుడి వివాహానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వరుడు వెంకటేష్, వధువు వనజాక్షిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడారు. ప్రజల్లో టిడిపికి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని తెలిపారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు దేవేంద్రప్ప, గుర్రం అనిల్, జహీర్, అమరేష్, జనార్ధన స్వామి, బోగేష్, గడ్డం నాగరాజు, గౌతమ్ నాయుడు, కొండ రామాంజిని, గురు గోపాల్ పాల్గొన్నారు.
వధువరులను ఆశీర్వదిస్తున్న నాయకులు










