May 16,2023 22:30

కందికుంటను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : కదిరి పట్టణం కుటాగులకు చెందిన సుధాకర్‌ యాదవ్‌ను టిడిపి రాష్ట్ర సాధికార సమితి కమిటీ సభ్యులుగా నియమిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ను సుధాకర్‌ యాదవ్‌ కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ టిడిపిలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న తనను కందికుంట వెంకట ప్రసాద్‌ గుర్తించి ఈ అవకాశం కల్పించారని అన్నారు. నియోజకవర్గంలో టిడిపిని పూర్వవైభవం తీసుకురావటానికి కందికుంట వెంకటప్రసాద్‌ గెలుపునకు కృషి చేస్తానన్నారు. బీసీల సమస్యలను గుర్తించి పార్టీకి తెలియజేస్తానని చెప్పారు.