Oct 03,2023 00:29

అరుకులో నిరసన చేపడుతున్న నేతలు

ప్రజాశక్తి-అరకులోయ:వైసీపీ ప్రభుత్వం ప్రజా స్వామ్యంను ఖూని చేస్తుందని రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి సియ్యారి దొన్నుదొర విమర్శించారు.చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ అరకులోయలో సోమవారం దీక్ష చేపట్టారు. పెదలబుడు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పెట్టేలి దాసు బాబు, నాయకులు బూర్జలక్ష్మి, నాగరాజు, పి.రవీంద్ర, జగన్‌, చందు పాల్గొన్నారు.
పెదబయలు:మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడ్ని విడుదల చేయాలని మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద టిడిపి నేతలు నిరసన దీక్ష సోమవారం చేపట్టారు. అనంతరం మాజీ మంత్రి శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, వైసిపికి ప్రజలే సంకెళ్లు వేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్టీ సెల్‌ కమిషన్‌ సభ్యులు సెవెరీ అబ్రహం, మండల పార్టీ అధ్యక్షులు సీకారి సుకుమారి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్‌రావు, మండల అధ్యక్షులు బాబురావు, తులసిరావు, మాజీ జీసిసి చైర్మన్‌ శెట్టి లక్ష్మణుడు, మాజీ వైస్‌ ఎంపీపీ పొద్దు, క్లస్టర్‌ ఇంచార్జి మురళి పాల్గొన్నారు
అనంతగిరి:చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు టి.బుజ్జీబాబు ఆధ్వర్యాన నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, మండల నాయకులు టి.ఆనందరావు బొర్రా సర్పంచ్‌ జె.అప్పారావ,ు మాజీ సర్పంచ్‌ సోమ పాల్గొన్నారు.
చింతపల్లి:అంతిమ విజయం న్యాయానిదే అవుతుందని తెదేపా మాజీ మండల అధ్యక్షుడు బేర సత్యనారాయణ అన్నారు. లంబసింగి (కొర్రుబయులు) గ్రామంలో ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మయ్యతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎంపిటిసి సభ్యుడు పొత్తూరు రామ్మూర్తి, మాజీ మండల ఉపాధ్యక్షుడు బోనంగి సోమలింగం పడాల్‌, బోనంగి పార్వతమ్మ, వెంకటరమణ, రామారావు పాల్గొన్నారు.
చింతూరు:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పిలుపు మేరకు ఒక్కరోజు సత్యమేవ జయతే దీక్ష సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు చేపట్టారు. ఈ దీక్షకు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు ఇల్ల చిన్నారెడ్డి, మల్లెల వెంకటేష్‌, మడివి రాజు, నాగేశ్వరరావు, కవిత, పుట్టి రమేష్‌ మువ్వా శ్రీను, వాళ్ల రంగారెడ్డి, ముత్యాల రామారావు, భారపాటి ప్రకాష్‌, ఆదినారాయణ, ధనలక్ష్మి, నాలుగు విలీన మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీలేరు : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా జీకే వీధి మండలం సీలేరులో సోమవారం రాత్రి 7 గంటల నుండి 5 నిమిషాల పాటు ప్రతి ఇంట్లో లైట్లు ఆపేసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. టిడిపి పిలుపుకు పలువురు మద్దతుగా లైట్లు ఆపేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిద్దాం అంటూ నినాదాలు చేశారు.