Oct 20,2023 23:41

ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ మండల పరిధిలోని ఉప్పు గుండూరు గ్రామంలో టిడిపి గ్రామ అధ్యక్షుడు కాట్రగడ్డ చంద్రబాబు ర్యాలీ నిర్వహించారు. ఉప్పుగుండూరు బస్టాడ్‌ వద్ద కూలి వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నుంచి పోలేరమ్మ గుడి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టిడిపి సంతనూతలపాడు నియోజక వర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌.విజయకుమార్‌,మాజీ ఎంపిపి ముప్పవరపు వీరయ్య చౌదరి, టిడిపి మండల అధ్యక్షుడు తేళ్ళ మనోజ్‌ కుమార్‌, మండల కార్యదర్శి కాకర్ల లక్ష్మి వరప్రసాద్‌, గుమ్మడి సాయిబాబా, బాపట్ల పార్లమెంట్‌ ఎస్‌టి సెల్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు , కనగాల శ్రీనివాస రావు , గోగినేని ఆంజనేయులు, ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు జాన్సన్‌ , బెల్లం వెంకటేశ్వర్లు, బీసీ సెల్‌ కార్యదర్శి సెల్వం , ఈదర కష్ణారావు, ఎస్‌టి సెల్‌ మండల అధ్యక్షుడు నాగమల్లేశ్వరవు , బీసీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌ ,కొమ్మాల పాటి సురేష్‌ మహిళా నాయకురాలు ఝాన్సీ , హరినాథ్‌ , పాలపర్తి బాలకోటి తదితరులు పాల్గొన్నారు.