Sep 24,2023 22:03

జలదీక్ష చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - కురుపాం : రాజకీయ కక్షతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని కురుపాం నియోజకవర్గ పరిశీలకులు అరేటి మహేష్‌బాబు అన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన కురుపాం టిడిపి కార్యాలయంలో ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కు వస్తున్న ప్రజాదరణ చుసి ఓర్వలేక అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రజలందరూ చూస్తూ గమనిస్తున్నారని, ఖచ్చితంగా వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి, రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌, ట్రేడ్‌ యూనియన్‌ నియోజకవర్గ అధ్యక్షులు రాంప్రసాద్‌, మండల కన్వీనర్లు కలిశెట్టి కొండయ్య, సుధా, టిడిపి నాయకులు కన్నా, కిమిడి రామరాజు, నందివాడ కృష్ణబాబు, నియోజకవర్గం యువత అధ్యక్షులు దివాకర్‌, పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జలదీక్షలు
పార్వతీపురంరూరల్‌ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మండలంలోని జమదాలలో ఆదివారం, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు ఆధ్వర్యంలో స్ధానిక సర్పంచ్‌ రెడ్డి భారతి, ఎంపిటిసి పి.శ్రీనివాసరావుతో కలిసి ఆ గ్రామంలోని చెరువులో అర్ధనగ ప్రదర్శన చేస్తూ జలదీక్షలు నిర్వహించారు.
భామిని : బాబుతో నేను కార్యక్రమాల భాగంగా టిడిపి నాయకులు పడాల భూదేవి ఆధ్వర్యాన మండలంలోని కోసంగూడకాలనీ, లోహరజోల, బిల్లుమడ, సింగిడి తదితర గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం భూదేవి మాట్లాడుతూ బాబుకు అండగా నిలవండి రాష్ట్ర భవిష్యత్తు కాపాడండని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అంగూరు దశరధనాయుడు, ఎస్‌.ప్రకాశరావు, కరణం లచ్చుంనాయుడు, కె రాజారావు, మాజీ ఎంపిపి సవర కుంపి, మాజీ సర్పంచ్‌ కె.రామరాజు, మాజీ ఎంపిటిసి పిలక కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : చంద్రబాబుకు తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నేని అప్పలనాయుడు, మండల, పట్టణ అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌, జామి లక్ష్మీనారాయణ, ఎఎంసి మాజీ చైర్మన్‌ పి.కృష్ణమూర్తినాయుడు, బి.నీలకంఠంనాయుడు, కె.అసిరినాయుడు, పారిచర్ల వెంకటరమణ, బల్ల హరిబాబు, మాచర్ల అనిల్‌ కుమార్‌, వి.శ్రీనివాసరావు, ఎ.కుమారస్వామి, జామి సింహాచలం, డి.శ్రీనివాసరావు, తాతబాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మండలంలోని డుమ్మంగిలో టిడిపి నాయకులు ఆదివారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. టిడిపి అరకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు ఆధ్వర్యంలో బాబుతో నేను అని రాసి పలువురు నాయకులు పోస్టుకార్డులను చంద్రబాబు పేరుతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు పోస్ట్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మండంగి భూషణ తదితరులు ఉన్నారు.