Aug 30,2023 23:04

ప్రజాశక్తి-ఉయ్యూరు : వైసీపీ ప్రభుత్వ ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ చేపట్టిన నిరసన కార్య క్రమాల్లో భాగంగా బుధవారం ఇబ్రహీంపట్నంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాల జీ ఆఫీస్‌ వద్ద ఆందోళలో పాల్గొన కుండా ఉయ్యూరు పట్టణ, మండల పరిధి గ్రామా ల్లో పార్టీ నాయకులను పోలీ సులు గహనిర్భందం చేశారు. మాజీఎమ్మెల్సీ, టీడీపీ ష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాదు ఆయన ఇంటినుండి బయటకు రానివ్వకుండా పట్టణ ఎస్సై వీరప్రసాద్‌, ఏఎస్సై రమేశ్‌, సిబ్బంది నిర్భందించారు. బీసీసగర సాధి కార రాష్ట్ర అధ్యక్షుడు జంపన వీర శ్రీనివాస్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు గుర్నాధరావు, ఫణి, చిరంజీవి, అజ్మతుల్లాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావును చినఓగిరాలలో రూరల్‌ పోలీసులు గహనిర్భందం చేశారు.