Sep 12,2023 20:13

అధికారిని ప్రశ్నిస్తున్న మాధవ రావు దేశాయి

ప్రజాశక్తి - నందవరం
అధికారుల పేరుతో కొంతమంది వైసిపి మద్దతు దారులు బోగస్‌ ఓట్లు తీసేస్తారని, టిడిపి మద్దతుదారుల ఓట్లు తీసేసే అవకాశం ఉందని, టిడిపి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని టిడిపి తాలూకా క్లస్టర్‌ ఇన్‌ఛార్జీ మాధవరావు దేశాయి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో టిడిపి నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, దీక్షలతో బయట తిరుగుతున్నారని తెలిపారు. అదే అదునుగా భావించి కొంతమంది వైసిపి మద్దతుదారులు టిడిపి మద్దతు దారుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఎవరైనా కొత్త వారు గ్రామాల్లోకి వచ్చి ఓటర్లను తనిఖీ చేయాలని చూస్తే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. టిడిపి నాయకులు అప్రమత్తంగా ఉండి, అనుమానం వచ్చిన అధికారిపై వెంటనే స్థానిక ఎన్నికల అధికారైన తహశీల్దార్‌, లేదా జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు.
మృతుల కుటుంబాలకు టిడిపి పరామర్శ
నందవరంలో అనారోగ్యంతో మృతి చెందిన కోటికల్‌ మాబు సాబ్‌, హోటల్‌ చాంద్‌ కుటుంబాలను టిడిపి నాయకులు మాధవరావు దేశాయి, దేశాయి నెట్‌వర్క్‌ అధినేత గురురాజ్‌ దేశాయి వేర్వేరుగా వెళ్లి పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతిని తెలిపి, కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.