ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ.జయనాగేశ్వర రెడ్డి పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. అండగా ఉంటామని బీవీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పట్టణంలోని 5వ వార్డు శివన్న నగర్‌కు చెందిన నిరుపేద టిడిపి కార్యకర్త సంజీవులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకొని స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన బీసీ సాధికార సమితి (ఈడిగ సంఘం) జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్‌ను పరామర్శించారు. శంకర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకొని గ్రామానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక వైద్యునిగా తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు.
కార్యకర్తను పరామర్శిస్తున్న బీవీ.జయనాగేశ్వర రెడ్డి










