Oct 07,2023 21:15

పార్వతీపురంరూరల్‌.. కొవ్వొత్తులు, సెల్‌ఫోన్‌ లైట్లతో నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని గుమ్మలక్ష్మీపురంలో శనివారం రాత్రి చేపట్టారు. 5 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి టిడిపి నాయకులు నిరసన తెలిపారు. బయటకు వచ్చి దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగించి నిరసనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జగదీశ్వరి, మండల కన్వీనర్‌ పాడి సుదర్శన్‌ రావు ఉన్నారు.
సీతంపేట : టిడిపి సీనియర్‌ నాయకురాలు పడాల భూదేవి ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాలూరు రూరల్‌ : మండలంలోని మామిడిపల్లిలో తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు బి.తవుడు ఆధ్వర్యాన కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి డొంక పద్మావతి, టిడిపి నాయకులు సుధాకర్‌, తిరుపతి, రామారావు, శ్రీను, నీలయ్య, టి.తిరుపతి పాల్గొన్నారు.
భామిని : భామిని అంబేద్కర్‌ కూడలిలో చీకటిలో కొవ్వొత్తులు, సెల్‌ఫోన్‌ లైట్లతో టిడిపి నాయకులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బిడ్కి ప్రసాద్‌, కోరాడ రాజేష్‌, గురుబిల్లి లక్ష్మిపతి, అనిల్‌ శాంత్రో, కొల్ల మధు, లోపింటి రాజేష్‌ పాల్గొన్నారు.
సీతానగరం : టిడిపి మండల అధ్యక్షులు కొల్లి తిరుపతిరావు, ప్రధానకార్యదర్శి రౌతు వేణుగోపాల నాయుడు ఆధ్వర్యాన కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.
పార్వతీపురంరూరల్‌ : స్థానిక టిడిపి కార్యాలయం వద్ద కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తులతో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజరుచంద్ర పాల్గొన్నారు. కృష్ణపల్లిలో మాజీ ఎమ్మెల్యే బి.చిరంజీవులు ఆధ్వర్యాన నిరసన తెలిపారు.