Aug 29,2023 20:07

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
వచ్చే 2024 ఎన్నికల్లో టిడిపి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని టిడిపి సీనియర్‌ నాయకులు సూరం భాస్కర్‌ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రావుఫ్‌ కోరారు. మంగళవారం ఆదోని మండలం గణేకల్‌, కడితోట మాజీ సర్పంచులు మూకయ్య, రాజశేఖర్‌ గౌడ్‌, ఇస్వీ అయ్యప్ప, పార్వతమ్మ, నాయకులు, కార్యకర్తలను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. టిడిపి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా సమిష్టిగా కృషి చేయాలని కోరారు. నాయకులు ఫక్రుద్దీన్‌, రామచంద్రప్ప, సోమశేఖర్‌ రెడ్డి, శ్రీనివాసులు, మల్లేశ్వరప్ప, మాజీ కౌన్సిలర్‌ మల్లికార్జున, మద్దికెర రామకృష్ణ, ఎమ్‌డి.హుస్సేన్‌, నారాయణపురం గోవిందు, తిక్కన్న, తిమ్మప్ప, బసవరాజ్‌, పరమేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.