Oct 30,2023 20:41

సమావేశంలో మాట్లాడుతున్న మీనాక్షి నాయుడు

ప్రజాశక్తి - ఆదోని
వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదోని గడ్డపై టిడిపి జెండాను ఎగరవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జెబి గార్డెన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిష్మా పెరిగిందని తెలిపారు. ఆయన నాయకత్వంలో టిడిపి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఊపిరి ఉన్నంతవరకు తాను టిడిపిలోనే ఉంటానని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బయటకొస్తారని, ఆదోని ప్రజల, టిడిపి కార్యకర్తల మనసుల్లో ఉన్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించడం తథ్యమని పరోక్షంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో టిడిపిని బలహీనపరచాలని కుట్ర చేసి జగన్‌ ప్రభుత్వం చంద్రబాబును జైల్లోకి పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ మరింత పటిష్టంగా తయారైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే జనసేన, టిడిపి నాయకులు సమిష్టిగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మల్లప్ప గతంలో టిడిపిలో పని చేశారని, ఇటీవల జనసేన పార్టీలో చేరిన రమేష్‌ యాదవ్‌ సైతం పాత మిత్రుడేనని చెప్పారు. టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు, రంగస్వామి నాయుడు, బసాపురం రామస్వామి, తెలుగు యువత నాయకులు భూపాల్‌ చౌదరి, మారుతి నాయుడు, వెంకటేష్‌ చౌదరి, జెబి.రంగన్న, సున్నంబట్టి లక్ష్మన్న, ముస్లిం, మైనార్టీ నాయకులు అప్సర్‌ బాష, బుద్ధారెడ్డి, రంగన్న, ఆరెకల్‌ రామకృష్ణ, మారుతి రావు, దొడ్డనకేరి శివప్ప, మండల అధ్యక్షులు బసవరాజు, తిమ్మప్ప, వెంకటేష్‌, రాజు, జైరామ్‌, నెట్టేకల్‌ రవీంద్ర సింగ్‌, రాముడు, ఈరన్న, వీరారెడ్డి, కపటి శివ, జీవన్‌, షణ్ముఖ, వీరేష్‌, కొమరం భీమ్‌ వీరేంద్ర, బసాపురం ప్రభాకర్‌, రమణ, మదిరే పీరా, వీరేష్‌ ఉన్నారు.