Nov 01,2023 21:18

ఫొటో : మాట్లాడుతున్న మాలేపాటి సుబ్బానాయుడు

టిడిపి 5వ క్లస్టర్‌ సమావేశం
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు అధ్యక్షతన కావలి పార్టీ కార్యాలయంలో 5వ క్లస్టర్‌ ఇంచార్జ్‌ గుత్తికొండ కిషోర్‌బాబు ఆధ్వర్యంలో క్లస్టర్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోతుగంటి అలేఖ్య, పట్టణ ముఖ్య నాయకులు పోతుగంటి శ్రీకాంత్‌, యూనిట్‌ ఇన్‌ఛార్జులు, బూత్‌ కన్వీనర్లు, వార్డు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుబ్బానాయుడు ప్రతి ఒక్కరితో మాట్లాడి, ఓటర్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి బూత్‌ కన్వీనర్‌ రోజులో ఒక గంట పార్టీకి పనిచేస్తే మన గెలుపు సులభతరం అవుతుందన్నారు. పార్టీ గెలుపునకు తమవంతుగా అందించు సలహాలను వారి నుండి స్వీకరించారు.