Mar 29,2023 22:52

gannavaram lo

టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి-యంత్రాంగం
తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లావ్యాప్తంగా బుధవారంనాడు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్‌ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గుడివాడ : టిడిపి నాయకులు వెనిగండ్ల రాము ఆద్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ఉన్న నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుత్తా చంటి, చల్ల గుళ్ళ సుబ్రహ్మణ్యేశ్వరరావు, నిమ్మగడ్డ సత్యసాయి, షక్‌ ఇబ్రహీం, రాథాకృష్ణ, జంగం రాజు, కైలే సుబ్బారావు, రామశాస్త్రులు, కంచనపల్లి సుబ్రహ్మణ్యం, అందుగుల ఏసుపాదం, జోన్స్‌, మెరుగు మోజేష్‌,మరియకుమారి సూరపనేని రాజ, అడుసుమిల్లి లక్ష్మణరావు, బొంబాయి శ్రీను,లింగం చిట్టిబాబు పాల్గొన్నారు. చల్లపల్లి : మండలం పరిధిలోని లక్ష్మీపురం, పాగోలులో వేడుకలు జరిగాయి. మండల టిడిపి అధ్యక్షులు, వైస్‌ ఎంపీపీ మోర్ల రాంబాబు, మచిలీపట్నం పార్లమెంట్లో నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి చల్లపల్లిగ్రామ సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, చండ్ర వెంకటేశ్వరరావు, యార్లగడ్డ శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు కొడాలి స్వప్న, మాలంపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గన్నవరం (ఉంగుటూరు) : మండల కేంద్రమైన ఉంగుటూరులో టిడిపి మండల అధ్యక్షులు ఆరుమళ్ళ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్లమెంటరీ కార్యదర్శి కొండేటి వెంకటేశ్వరరావు, పార్లమెంటరీ రైతు నాయకులు దుడ్ల కుమార్‌, నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి పాతూరి రాజకుమార్‌ , ఎస్సీ సెల్‌ నాయకులు ఇందుపల్లి ప్రకాష్‌, మానికొండ గ్రామ కమిటీ సభ్యుడు షేక్‌ దాదా , నియోజకవర్గ బీసీ సెల్‌ నాయకులు కంపసాటి కొండలరావు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళ అనుక్‌ , పార్లమెంటరీ మహిళా లక్ష్మీ, వీరమాచినేని బుజ్జి భూపతి మాదాల శీను వెంకటేశ్వరరావు,గోవాడ రాజేష్‌ ,మండల లక్ష్మీ,గరిమెళ్ళ నరేంద్ర పాల్గొన్నారు. తోట్లవల్లూరు : మండలంలోని గరికపర్రులో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు వీరపనేని శివరాం ప్రసాద్‌, గూడపాటి గిరిబాబు, నక్కలపూడి మురళి, ఎస్‌.వి.కృష్ణారావు పాల్గొన్నారు. కోడూరు : కోడూరు ప్రధాన సెంటర్‌; గొల్లపాలెం రోడ్డులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టిడిపి మండల అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, కాగిత రామారావు, మద్దూరి కాంతారావు, దేవన బోయిన వెంకటేశ్వరరావు, బడే గాంధీ, పూతబోయిన శ్రీనివాసరావు, సుంకర లక్ష్మి, కడవకొల్లు నాంచారయ్య, బెల్లంకొండ కోటేశ్వరరావు, కొప్పనాతి సత్యనారాయణ, బడే రమణ, అప్పికట్ల రవీంద్ర, బొడ్డు వెంకన్న, దావు చిన్నబాబు, కాగిత ప్రసాద్‌, ఉప్పాల కోటేశ్వరరావు, కొక్కిలిగడ్డ జాన్‌ విల్సన్‌, బెల్లంకొండ కోటేశ్వరరావు,గిరి పాల్గొన్నారు. పమిడిముక్కల : మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలు జరిగాయి. టిడిపి మండల అధ్యక్షులు రాజులపాటి శ్రీనివాసరావు పతాకాన్ని ఆవిష్కరించారు. పరుచూరి వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, బాపూజీ, మధు, రామారావు పాల్గొన్నారు. గన్నవరం : టిడిపి ఆవిర్భావ వేడుకల్లో సీనియర్‌ నాయకులు జాస్తి శ్రీధర్‌, షేక్‌ మీరా, చప్పిడి రామచంద్రరావు, ముదుగుమూడి శివయ్య, దేవినేని సులోచన రాణి, కాసింనేని బాబురావులను సన్మానించారు. చెమట శ్రీనివాసరావు, మొరుగు వేణుగోపాలరావు, జాస్తి మురళి, బోడపాటి రవి, గూడవళ్లి నాగేశ్వరరావు, గూడవళ్లి నరసయ్య, ఆరుమళ్ల కష్ణారెడ్డి, ఖమ్మంపాటి బోసు, చిక్కవరపు నాగమణి, బుస్సే నాగప్రసాద్‌, నర్రా లక్ష్మణరావు, బాలకష్ణ పలగాని, కాట్రగడ్డ అరుణకుమారి, చిరుమామిళ్ల సూర్యం, బొప్పన హరికృష్ణ, పార్టీ కోఆర్డినేటర్‌ బచ్చుల సుబ్రహ్మణ్యం(బోసు) పాల్గొన్నారు. హనుమాన్‌జంక్షన్‌ : బాపులపాడు మండలం రంగన్న గూడెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ అధ్యక్షులు మొవ్వా వేణుగోపాల్‌ నివాళులర్పించారు. ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడారు. ఎంపీటీసీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ,ఉప సర్పంచ్‌ బెజవాడ వెంకట కృష్ణారావు, ఎంపీసీఎస్‌ అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కసుకుర్తి అర్జునరావు, మందపాటి రాంబాబు, కనకవల్లి యాకోబు, కాట్రు పాపారావు,కనకవల్లి శేషగిరి రావు, కోలుసు సూరి బాబు, తలారి యోహాను, తుమ్మల వెంకటేశ్వర రావు, కొలుసు గంగాజలం, కసుకుర్తి కష్ణ కిషోర్‌, మొవ్వ పూర్ణ చంద్ర రావు,లావు సుబ్బారావు పాల్గొన్నారు.
గుడివాడ : స్థానిక టిడిపి కార్యాలయం నుండి ప్రదాన రాహదారుల మీదుగా ఎన్‌టిఆర్‌ స్టేడియం వరకు రావి వెంకటేశ్వరావు అదేశాల మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టిడిపి పట్టణా, రూరల్‌ మండలల అధ్యక్షులు దింట్యాల రాంబాబు, వాసే మురళీ మాట్లాడారు. టిడిపి నాయకులు గోవాడ శివ, గోకవరపు సునీల్‌, పండ్రాజు సాంబశివరావు, శొంఠి రామకృష్ణ, యలమంచిలి సతీష్‌, షేక్‌ జానీ షరీఫ్‌, యార్లగడ్డ సుధారాణి, గొర్ల శ్రీలకీë, వేమూరి సుజాత, మదాల సునీత, కంచర్ల సుధాకర్‌, దారపురెడ్డి మణేశ్వరరావు, పాల్గొన్నారు. అవనిగడ్డ : టిడిపి పార్టీ కార్యాలయం వద్ద వేడుకలను నిర్వహించారు. సీనియర్‌ నాయకులు విశ్వనాథపల్లి పాప, మెగా వత్తు గోపి, మండలి రామ్మోహనరావు, చందు గాంధీలను సత్కరించారు. పార్టీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, కర్ర సుధాకర్‌, బండే నాగ వెంకట కనకదుర్గ, ఘంటసాల రాజమోహనరావు, అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, షేక్‌ బాబావాలి, మొగల్‌ మురాద్‌ బేగ్‌, బర్మా శ్రీనివాసరావు పాల్గొన్నారు. మొవ్వ : టిడిపి మచిలీపట్నం పార్లమెంట్‌ ఉపాద్యక్షులు నన్నపనేని వీరేంద్ర ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. టిడిపి మండల అధ్యక్షులు రామలింగేశ్వర రావు, తెలుగు యువత జిల్లా ఉపాద్యక్షులు పెదపూడి ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.