Aug 16,2023 20:18

తహశీల్దార్‌ను సన్మానిస్తున్న ప్రతిభ స్కూల్‌ యాజమాన్యం

ప్రజాశక్తి - కౌతాళం
కౌతాళం తహశీల్దార్‌ రామేశ్వరరెడ్డిని బుధవారం సన్మానించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తహశీల్దార్‌ రామేశ్వర రెడ్డి ఉత్తమ సేవలను గుర్తించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కలెక్టర్‌ సృజన అవార్డు అందజేశారు. బుధవారం ప్రతిభ హైస్కూల్‌ యాజమాన్యం తహశీల్దార్‌ను శాలువా, పూలమాలతో సన్మానించారు. పాఠశాల సెక్రటరీ సయ్యద్‌ మైనుద్దీన్‌ మాట్లాడుతూ... ప్రతిభ కలిగిన వారికి ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాంటి సత్కారం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఆర్‌డిఒగా పదోన్నతి పొందాలని ఆకాంక్షించారు. పాఠశాల కరస్పాండెంట్‌ సయ్యద్‌ దూద్‌ బాష, ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వరి, జయలక్ష్మి, రామలక్ష్మి, భీమేష్‌, రాజు, విరుపాక్షి, పరమేష్‌, శిరీష, ముముతాజ్‌ పాల్గొన్నారు.