Jul 31,2023 20:40

సర్వేను ప్రారంభిస్తున్న సర్పంచి అరుణ్‌ కుమార్‌

ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని తెర్నేకల్‌ గ్రామంలో 'వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష'లో భాగంగా భూ సమగ్ర సర్వేను సోమవారం సర్పంచి అరుణ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి రైతూ పొలాన్ని రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప సర్పంచి భర్త బెల్‌ ఈరన్న, ఎంపిటిసి నామాల శ్రీను, గ్రామ పెద్ద కొత్త కాపు మధుసూదన్‌ రెడ్డి, సచివాలయ కన్వీనర్లు వాల్మీకి రాఘవేంద్ర, చాప ఈరన్న, విఆర్‌ఒ మునీర్‌ బాషా, సర్వేయర్లు సునీత, పద్మ, వైసిపి నాయకులు లింగన్న, తిమ్మప్ప పాల్గొన్నారు.