Jul 14,2023 19:28

ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని తెర్నేకల్‌ గ్రామంలో శుక్రవారం ఉన్నత పాఠశాల విద్యార్థులతో సబ్‌ యానిట్‌ అధికారి సాయిబాబా, సర్పంచి అరుణ్‌ కుమార్‌ ఆధ్యర్వంలో డెంగీ నివారణ మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు. 'దోమ పుట్టరాదు... దోమ కుట్టరాదు', పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి' అంటూ నినాదాలు చేశారు. తేరుబజారు వద్ద మానవ హారం ఏర్పాటు చేసి సీజనల్‌ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. పిహెచ్‌సి సూపర్‌వైజర్‌ ఈశ్వరయ్య, శ్రీధర్‌ పాల్గొన్నారు.