టెన్నికాయిట్ పోటీల విజేతలకు బహుమతులు
ప్రజాశక్తి-అవనిగడ్డ
మాజీ మంత్రి కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు సతీమణి మండలి ప్రభావతి దేవి స్మారక టెన్నికాయిట్ పోటీలు మంగళవారం ఉత్సాహ పూరిత వాతావరణంలో కొనసాగాయి. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జిల్లాస్థాయిలో ఈ పోటీలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి 28 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. బుద్ధ ప్రసాద్ సతీమణి విజయలక్ష్మి పోటీలను ప్రారంభించారు. ఘంటసాల మండలం పెదకళ్ళేపల్లి, కంకటావ, గొడవర్రు-ఎ, గొడవర్రు-బి జట్లు సెమీఫైనల్స్ చేరుకున్నాయి. ఇందులో గొడవర్రు-ఎ, కంకటావ జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఫైనల్ పోటీల్లో గొడవర్రు-ఎ విన్నర్‌గా నిలవగా కంకటావ జట్టు రన్నర్‌గా నిలిచింది. వీరికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ సతీమణి విజయలక్ష్మి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు టి.రత్నకుమారి, కె.పూర్ణచంద్రరావు, డి.వెంకటేశ్వరరావు, జి ఎల్ ప్రసాద్, కె.ఫణీంద్ర, బి.శేషగిరి, ఎ.రామారావు, ఉదరు కుమార్, వి.నాంచారయ్య, శ్రీకాంత్, మారుతి, భాను ప్రకాష్, వీరబాబు, రవికుమార్, చలమేశ్వరరావు పోటీలకు ఎంపైర్లుగా వ్యవహరించారు.










