తెలుగులో శాలినికి డాక్టరేట్
తెలుగులో శాలినికి డాక్టరేట్
ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు విభాగపు పరిశోధక విద్యార్థిని పడవేటి శాలిని డాక్టరేట్ డిగ్రీని పరీక్షలు నియంత్రణ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె విశ్రాంత ఆచార్యులు మూలె విజయలక్ష్మి మార్గదర్శకత్వంలో ''కురబలకోట మండల జానపద గేయ సాహిత్యం'' అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వివరించారు. శాలిని పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని అనేక పరిశోధన పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. పడవేటి శాలినికి డాక్టరేట్ డిగ్రీ అవార్డు రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.










