Aug 29,2023 19:56

చిప్పగిరిలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌ సుబ్రమణ్యం

ప్రజాశక్తి - చిప్పగిరి
తెలుగు భాష మధురమైనదని కళాశాల ప్రిన్సిపల్‌ డివి.సుబ్రమణ్యం, తెలుగు అధ్యాపకులు సరళ దేవి తెలిపారు. మంగళవారం చిప్పగిరి కళాశాలలో గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేసిన గిడుగు రామ్మూర్తి అందరికీ ఆదర్శమని తెలిపారు. ఆయన ఒక బడి పంతులుగా పని చేసి తెలుగు భాషను, అందులోని మాధుర్యాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా కృషి చేశారని కొనియాడారు.