Oct 18,2023 22:49

.తెల్లరాయి అక్రమార్కులపై దాడులు

.తెల్లరాయి అక్రమార్కులపై దాడులు
-అనుమతులు లేకుంటే కేసులు నమోదు..
- అటవీ, రెవెన్యూ అధికారుల హెచ్చరిక
ప్రజాశక్తి - బాలాయపల్లి : అనధికారకంగా అటవీ, రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూములలో తెల్లరాయి లోడుతున్న జెసిబిని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు దాడులు చేసి పట్టుకున్న సంఘటన బుధవారం వెలుగు చూసింది. తహశీల్దారు శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని నాయుడు చెరువు కండ్రిగ (పెండెరే డ్డివారిపల్లి) గ్రామంలో తెల్లరాయి అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా జెసిపి తో తెల్లరాయి లోడుతున్నారని సమాచారం రావడంతో సంఘటన స్థలానికి వెళ్లి జెసిబిని, తెల్లరాయి ఆక్రమంగా లోడుతున్న వారితో సహా అదుపు లోకితీసుకున్నారు. చట్టపరిధిలో లేకుంటే కేసులు నమోదు చేసా ్తమని హెచ్చరించారు. అంతేకాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామీణ ప్రాంతాలలో రాత్రుల్లో తెల్లరాయి లోడుతున్న వారు దొరికితే క్రిమినల్‌ కేసులతో పాటు అధిక మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరిం చారు. అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు దాడుల్లో పాల్గొన్నారు.