Jul 30,2023 16:29

ప్రజాశక్తి-కర్నూల్ స్పోర్ట్స్ : నగరంలోని కిట్స్ వరల్డ్ లో జరిగిన తైక్వాండో పోటీలలో పార్థసారథి  కాలనీ కి చెందిన  చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలను సాధించరు. ఈ సందర్భంగా ఆదివారం నాడు. పార్థసారథి నగర్ లోని  వైయస్సార్ పార్క్ లో ఏర్పాటు చేసిన  సత్కార కార్యక్రమంలో కాలనీ సంఘ ప్రతినిధులు మోహన్ కృష్ణ, షేర్ ఖాన్, ముత్తు జావలి, జి. శ్రీనివాసులు పాల్గొన్నారు. టైక్వాండో పోటీలలో పథకాలు సాధించిన చిన్నారులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన కాలనీ చిన్నారులు నగర స్థాయి పోటీలకు పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశాన్ని కల్పించుకోవాలని వారు ఉద్దోదించారు. పథకాలు సాధించిన చిన్నారులను అభినందించారు.