చిలమత్తూరు : చిలమత్తూరు మండల పరిధిలోని టేకులోడు క్రాస్ (544-ఈ)శిరా జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పార్చునర్ కారు కొడికొండ చెక్‌పోస్టు వైపు నుంచి హిందూపురం వెళ్తోంది. అదే సమయంలో హిందూపురం వైపు నుంచి బొలేరో వాహనం చిలమత్తూరు వైపు నుంచి టేకులోడు క్రాస్‌కు మళ్లింది. ఈ సమయంలో రెండు వాహనాలు ఒకదానితో ఒకటి వేగంగా ఢకొీన్నాయి. ఈ ఘటనలో బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్న పాతచామలపల్లి గ్రామానికి చెందిన కొత్తిమీర వ్యాపారి మధు(25) అక్కడికక్కడే మతి చెందాడు. మరో వ్యక్తి శంకర్ రెడ్డి(55) తీవ్రంగా గాయపడ్డాడు. ఈయన్న చికిత్స నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో ఆనంద్ నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పార్చునర్ కారులో ఉన్నాయి నలుగురు కూడా గాయపడ్డారు. ప్రమాదం జరిగినపుడు కార్లో బెలున్‌లు తెరుచుకోవడంతో ప్రాణనష్టం తగ్గినట్లు తెలుస్తోంది. గాయపడిన వెంకటేష్, పుష్పవతి, నారాయణరెడ్డి, సోములను 108 వాహణంలో హిందూపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన మధుకు బార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో పదిరోజుల కూతురు ఉంది. ఒకే గ్రామంలో ఇద్దరు మతి చెందడంతో పాతచామలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










