టేబుల్ 9 మూడో బ్రాంచ్ ప్రారంభం
ప్రజాశక్తి - తిరుపతి సిటీ : తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన టేబుల్ నైన్ మూడవ బ్రాంచ్ ను తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి ప్రారంభించారు. స్థానిక కరకంబాడి రోడ్ లోని డీమార్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ 9 హోటల్ తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే వినియోగదారుల మన్ననలు పొందిందన్నారు. నగరంలో ఇప్పటికే రెండు బ్రాంచ్ లు విజయవంతంగా నడుస్తున్నాయని, ఈ మూడో బ్రాంచ్ కూడా సక్సెస్ మార్గాల్లో ప్రయాణించాలని అభినందించారు. ఆ సంస్థ అధినేత వైష్ణవ్ మాట్లాడుతూ టేబుల్ 9 బ్రాంచ్ లను ఇప్పటికి తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద, కపిల్ తీర్థం రోడ్ లోనూ ఏర్పాటు చేశామన్నారు. మూడవ బ్రాంచ్లో గెస్ట్‌లైన్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. టేబుల్ నైన్ ఆహారాన్ని తిరుప తి మొత్తం విస్తరింప జేయా లని లక్ష్యం తో ముందు కు వెళు తున్నా మ న్నా రు. జాయిం ట్ బిర్యానీ లెమన్ చికెన్ తమ ప్రత్యేకతని, ఇతర వాటితో పోలిస్తే తమ రెస్టారెంట్ల లోని ఆహా రం కాస్త స్పైసీగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, డాలర్ దివాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, తిరుపతి హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు చిల్లీస్ అంజి, కార్పొరేటర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.










