Oct 25,2023 00:03
తైక్వాండో పోటీలకు ఎంపికైన విద్యార్థులు

ప్రజాశక్తి-కొండపి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు జిల్లా నుంచి పాల్గొననున్న విద్యార్థుల ఎంపిక ఒంగోలులో నిర్వహించినట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ సెక్రటరీ వైకే శ్రీనివాసరావు తెలిపారు. తైక్వాండో చాంపియన్‌ షిప్‌ పోటీలకు 30 మంది విద్యార్థులు ఎంపికైన ట్లు వారిలో ఎక్కువ మంది కొండపి మండలం కట్టావారిపాలెం మన ఊరి వికాసం తరుపున వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 29న 21వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌ షిప్‌ పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. ఎంపికకు కొండపి మండలం కట్టావారిపాలెం మన ఊరి వికాసం నుంచి విద్యార్థులు ఎక్కువ మంది వచ్చినట్లు చెప్పారు. ప్రతి ఆదివారం మన ఊరి వికాసం తైక్వాండో విద్యార్థులకు శిక్షణ అంతర్జాతీయ తైక్వాండో మాస్టరు మారుతి ప్రసాదు, వాసు ఇస్తున్నారు.