Oct 16,2023 20:26

తాగునీటి వసతిని ప్రారంభిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - కోసిగి
కోసిగిలోని ఎపి మోడల్‌ స్కూల్‌ సమీపంలో కొత్తగా ఏర్పాటైన జగనన్న కాలనీకి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు తాగునీటి వసతిని ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ మల్లికార్జున రెడ్డి, వైసిపి యువ నాయకులు రాజేష్‌ తెలిపారు. సోమవారం సర్పంచి అయ్యమ్మ సమక్షంలో కొత్తగా ఏర్పాటు చేసిన బోర్లకు కొత్త మోటార్లు అమర్చి తాగునీటిని ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎఇ మల్లికార్జున రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. ఒక్క కోసిగిలోనే జగనన్న కాలనీలో ఏడు బోర్లు వేయించామని తెలిపారు. 30 మినీ ట్యాంకులను ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి, సర్పంచి అయ్యమ్మకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. బేడ బుడగ జంగం తాలూకా అధ్యక్షులు అయ్యప్ప, కాలనీ వాసులు మారెప్ప పాల్గొన్నారు.