Oct 15,2023 00:21

శంకుస్థాపన చేస్తున్న సర్పంచ్‌

ప్రజాశక్తి- అరకులోయరూరల్‌:మండలంలోని లోతేరు పంచాయితీ శిరసగుడ గ్రామంలో శనివారం జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం నిధుల ద్వారా తాగునీరు ట్యాంక్‌ నిర్మాణానికి స్థానిక సర్పంచ్‌ గుబాయి కళావతి భూమి పూజ చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, గతంలో గ్రామంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బంది పడేవారన్నారు. ట్యాంక్‌ ఏర్పాటు చేసి తాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.