ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగర పరిధిలోని లక్ష్మీ నగర్ జన్మభూమి పార్కు లో స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా పార్క్ ను శుభ్రం చేసే కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్లు వాసంతి, విజయ భాస్కర్ రెడ్డి లతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ఇండియన్ స్వచ్ఛత లీగ్ -2లో భాగంగా స్వచ్ఛతా హీ సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు . గతంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మాత్రమే పారిశుద్ధ్య అవగాహన కార్యక్రమాలలో పాల్గొనే వారన్నారు. మేధావులను ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు.అందులో భాగంగానే ఇప్పటికే యువతను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమం, పార్కులను శుభ్రం చేయడం, 2కే రన్ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సైఫుల్లా ,అనిల్ కుమార్ రెడ్డి, రామ్, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, ఇంజనీరింగ్అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










