Sep 23,2023 13:11

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పల మేజర్ పంచాయతీలో శనివారం డిఎల్పిఓ సుమన జయంతి ఎంపీడీవో దివాకర్ ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవ ర్యాలీని స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ వరకు విద్యార్థులు అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత మరుగుదొడ్డి ఆవశ్యకత గురించి నినాదాలు చేశారు అనంతరం స్థానిక కస్తూర్బా పాఠశాలలో స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞను విద్యార్థులు అధికారులు చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ మనీలా సుప్రియ మండల విద్యాధికారి నారపరెడ్డి  నార్పల ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ కస్తూర్బా పాఠశాల ఎస్ ఓ నిర్మల, పంచాయతీ కార్యదర్శులు అస్వర్తనాయుడు, పరశురాముడు, పంచాయతీ కార్మికులు ప్రభుదాస్, శివశంకర్, నారాయణ స్వామి, శెట్టి శంకర్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.