Jun 11,2023 15:13

ప్రజాశక్తి-చల్లపల్లి : వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెందిన విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయ అధికారి బహుమతులను అందజేశారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రంథాలయ కమిటీ సభ్యులు పి రవి మాట్లాడుతూ  సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానికి భాండాగారాలని ప్రతి విద్యార్థి నిత్యం గ్రంథాలకు రావాలని సూచించారు. నిత్యం న్యూస్ పేపర్ చదవడం వల్ల సృజనాత్మకమైన విషయాలు తెలుస్తాయని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి గ్రంథాలయంలో లభిస్తాయి, వాటిని సద్వినియోగం పంచుకోవాలని సూచించారు. ఎంతోమంది గ్రంధాలయాలలో లభించే పుస్తకాలను చదివి ఉద్యోగాలు సాధించారని మరో ముఖ్య అతిథి శ్రీనుతెలిపారు. వేసవిలో 35 రోజుల పాటు గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని భాస్కరావు అన్నారు. ఈ కార్యక్రమాలను చల్లపల్లి శాఖ గ్రంథాలయ అధికారి కుంభ గణేష్ కుమార్ పర్యవేక్షించారు.