ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : ఈనెల 22న కర్నూలు జిల్లాలో జరిగే యుటిఎఫ్ ప్రచార జాతాలు జయప్రదం చెయ్యాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి టీ.గాదిలింగప్ప,యుటిఎఫ్ మండల అధ్యక్షుడు వై.రామాంజనేయులు కోరారు.బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ యుటీఎఫ్ ఆవిర్భవించి ఆగస్టు10,2023 నాటికి 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు ఆగస్టు 10,2024 వరకు జరుగుతాయని,ఈ సందర్భంగా విజయవాడలో అక్టోబర్1,2023 న ప్రారంభయ్యే స్వర్ణోత్సవ ప్రారంభ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవ ప్రచార యాత్ర (జాతా) రెండు ప్రాంతాల్లో ఈనెల 21న బైక్ యాత్ర ప్రారంభం అవుతాయని, హిందూపురంలో 21న ప్రారంభమైన బైకు ప్రచార (జాతా) యాత్ర 22న కర్నూలు జిల్లా పత్తికొండలో ఉదయం ప్రారంభమై కోడుమూరు,కర్నూలు కేంద్రాలలో జరుగుతాయన్నారు. ఈనెల 22వ తేది కర్నూలు జిల్లాలో జరిగే స్వర్ణోత్సవాల ప్రచార యాత్ర (జాతా)లో ఉపాధ్యాయులు యుటిఎఫ్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్ లింగన్న,ఉరుకుందయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










