ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : రక్తదానం చేస్తున్న యువకులు ప్రాణాలను నిలబెట్టే రక్తదానం చేసే ప్రతిఒక్కరూ సూపర్ హీరోలు అని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. మండలం పరిధిలో పెద్దహరివనం బ్లేడ్ డోనర్స్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామంలో స్థానిక కన్నడ పాఠశాలలో బుధవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. జరిగింది. ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిప్యూటీ డిఅండ్ఎంహెచ్ఓ సత్యవతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తం కొరత వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారందరికీ రక్తదాతలు ఇచ్చే రక్తం సంజీవని అని పేర్కొన్నారు. అత్యవసర స్థితిలో ఉన్న రోగికి రక్తం అవసరం ఉంటుందని, రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయినవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని అన్నారు.రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ఇటువంటి రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప తహాశీల్దార్ రజినీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ హెచ్,రాము,మాజీ సర్పంచులు ఆదినారాయణ రెడ్డి, రాఘవేంద్ర చారి, గ్రామ వైసిపి నాయకులు మెడికల్ నాగరాజ్,గర్జప్ప, హనుమంతప్ప,వీరేష్,బాలప్ప,మల్లప్ప,కుప్పలదొడ్డి రాజా, తిప్పన్నా, ఈరప్ప, వీరేష్, మల్లిరెడ్డి, సంతోష్, మదు, నాగరాజు,బ్లడ్ డోనర్స్ యూత్ సభ్యులు పరమేష్, జంబునాత,గర్జప్ప,రామన్న, అయ్యన్న,గర్జప్ప, హెచ్.కే.మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శులు నాగరాజ్,షేక్ అహ్మద్,ఎంఎన్హెచ్పి లక్ష్మీనారాయణ, ఏఎన్ఎంలు పుష్పలత, లక్ష్మీ, ఎంఎల్హెచ్పి కృష్ణవేణి, విఆర్వోలు తిరుమల రెడ్డి, రాజశేఖర్ గౌడ్, బసవరాజ్,వాలంటరీలు,గ్రామస్తులు పాల్గొన్నారు.










