Oct 22,2023 10:37

ప్రజాశక్తి-తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మౌత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణరథంలో ఊరేగించారు. రథంపై అధిష్ఠించిన స్వామికి అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలికారు. ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వాహన సేవల్లో చివరగా అశ్వ వాహన సేవ జరగనుంది. సోమవారం ఉదయం 6 నుంచి 9గంటల మధ్య ఉత్సవాల ముగింపుగా చక్ర స్నానం క్రతువును శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు.

2