Jul 24,2023 15:55

ప్రజాశక్తి-మంత్రాలయం : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రావణ మాసంలో జరిగే రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు రాష్ట్ర గౌరవ గవర్నర్ నజీర్ ను ఆహ్వాన పత్రిక అందజేశారు. శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థుల ఆదేశాల మేరకు సోమవారం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం మేనేజర్ యస్కే శ్రీనివాసరావు అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి పిఎ పురాణిక్ లు గవర్నర్ ను కలుసుకుని ఆగస్టు 31 వ తేదీ నుంచి జరుగుతున్న రాఘవేంద్రస్వామి పూర్వారాధనకు రావాలని కోరారు. అందుకు గవర్నర్ సమ్మతించారని శ్రీ మఠం మేనేజర్ యస్కే శ్రీనివాసరావు తెలిపారు.