ప్రజాశక్తి - పుల్లంపేట : మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఆదివారం నాడు దాతలు శ్రీ మాడ రవిశంకర్, రామ శాంతి దంపతులు గతంలో జరిగిన క్రికెట్, బాల్ బ్యాట్మెంటన్, బ్యాట్మెంటన్, క్రీడలలో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, మరియు సౌత్ జోన్ క్రీడలలో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచి నందుకుగాను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బాల శేఖర్ అభ్యర్థన మేరకు దాతలు విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ క్రికెట్ టెన్నిస్ బాల్ మొదలగు క్రీడలలో బాగా రాణించి పాఠశాల మరియు గ్రామం ప్రతిష్టలు పెంచడం వల్ల వారిని క్రీడలలో అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ క్రీడా సామాగ్రిని పాఠశాలకు అందిస్తున్నట్లు వారు తెలియజేశారు. విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలకు క్రీడ సామాగ్రిని ఎంపిక చేయడం పట్ల దాతలను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.










